జన్నారం, జూన్ 23 : మండలంలో కిష్టాపూర్ ఊరచెరువులో అక్రమంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని చెర్లపల్లె మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కిష్టాపూర్ చెరువులో ధర్నా చేపట్టారు.
విషయం తెలుసుకున్నా ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని మత్స్యకారులతో మాట్లాడారు. సర్వే చేసి భూములు ఆక్రమించుకున్నట్లు తేలితే పట్టాలు రద్దు చేస్తామని, హద్దులు నిర్ణయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.