దస్తురాబాద్, మే 31 : భూత్కుర్ గ్రామ పం చాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారు లో గల గోదావరిలోని చింతమడుగే మాకు జీవనోపాధి అని రాంపూర్ గ్రామ మత్స్యకారులు అన్నారు. రాంపూర్ గ్రామ శివారులోని గోదావరికి వెళ్లే దారిలో మత్స్యశాఖ అధికారు ల తీరుపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా పూర్వీకులు గోదావరికి సమీపంలో చేపల వే ట కొనసాగించారు. ఈ మడుగే మా పిల్ల భవిష్యత్ అని అన్నారు.
మేము ఎవరి పరిధిలోకి పోము, మా పరిధిలోకి ఎవరిని రానివ్వం అ ని పేర్కొన్నారు. ఏడీ, ఎఫ్‌డీవో నిర్లక్ష్యం నశించాలని, పాత పద్ధతిలోనే లైసెన్స్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతకుముం దు అధికారులు చెప్పిన విధంగా దస్తురాబాద్ గ్రామ మత్స్యకారులు చేపల వేటకు రావడంతో మళ్లీ శనివారం గోదావరి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి. దస్తురాబాద్, కడెం ఎస్ఐలు సాయి కుమార్, కృష్ణ సాగర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. దస్తురాబాద్ గ్రామ మత్స్యకారులను గంగమ్మ గుడి వద్దకు పంపారు. ఎలాంటి ఘర్షణలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బ త్తుల విశ్వంబర్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఏడీ రాజనర్సయ్య, ఎఫ్‌డీవో విజయ్ కిరాంకర్, ఖానాపూర్ సీఐ అజయ్‌లు దస్తురాబా ద్, రాంపూర్ గ్రామాల మత్స్యకారులతో మా ట్లాడారు. ఇరు వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో మత్స్యకారులతో మాట్లాడుతామని ఏడీ తెలిపారు. అప్పటి వరకు దస్తురాబాద్, రాంపూర్ గ్రామాల మత్స్యకారులు గోదావరివరి చేపల వేటకు వెళ్లవద్దు అని సూచించారు.