మంచిర్యాల, ఫిబ్రవరి 10, నమస్తే తెలంగాణ : అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఫస్ట్ బర్డ్ వాక్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ అటవీ సంపద, జీవ వైవిధ్యం గురించి విద్యార్థులు, పరిశోధకులు, పక్షి ప్రేమికుల కు తెలిపేందుకు జన్నారం, ఖానాపూర్ డివిజన్లు మొదటిసారిగా సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ 300 పక్షి జాతులు, 600 మొక్కలకు నిలయంగా ఉంది. దీని వీక్షణకు ఒక్కక్కరికి రూ.1500 చొప్పు న రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. జన్నారం, ఖానాపూర్ అటవీ డివిజన్లలో దాదాపు 20 స్థానా ల్లో ముఖ్యమైన ఆవాసాలను కలుపుతూ పక్షులు, నీటి వనరులు, ప్రేమికులు, వన్యప్రాణులు ఉన్నట్లు గుర్తించారు. బర్డ్‌వాక్‌లో పాల్గొనేవారి కోసం అటవీశాఖ వారు వసతి, ఆహారం, అంతర్గత రవాణా సౌకర్యాలు కల్పించారు. పేర్లు నమోదు చేసుకున్నవారు జన్నారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో 12న ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)ను 2015లో స్థాపించారు. దీని కోర్ జోన్ 893 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1,120 చదరపు కిలోమీటర్లలో బఫర్ జోన్ అడవిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లులు మొదలైనవి నివసిస్తాయి. వీటితో పాటు అందమైన ప్రవాహాలు, సుందరమైన చెరువులు, కొండలు దర్శనమిస్తాయి. థార్న్ 300 పక్షి జాతులు, 600 పైన ఉన్న వృక్ష జాతులు, విభిన్న ప్రాణులు, ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పా ట్లు చేశారు. పాల్గొనేవారిని గ్రూపులుగా విభజిస్తా రు. అడవి పక్కన ఉన్న శిబిరాల వద్ద వారికి బస ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు అనుసరించాలని నిర్వాహకులు సూచించారు.
12న ఉదయం 11 గంటలకు పాల్గొనే వారి పేర్లను జన్నారం అతిథి గృహంలో నమోదు చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు టీడీసీ గెస్ట్‌హౌస్‌లో పరిచయం, 12.30 గంటలకు టైగర్ రిజర్వ్ గురించి సంక్షిప్త పరిచయం ఉంటుంది. 1.30 గంటలకు ఈఈసీ వద్ద భోజనం పెడుతారు. 2.30 గంటలకు పాల్గొనే వారిని జన్నారం ఎఫ్ఆర్వో నాలుగు సమూహాలుగా విభజిస్తారు. 2.45 గంటలకు వన్యప్రాణుల అన్వేషణ కోసం అటవీ ప్రాంతాలు, సాయంత్రం 4.30 గంటలకు పక్షులను వీక్షించేందుకు నీటి వనరులను సందర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు తిరిగి గోండుగూడ క్యాంపునకు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు క్యాంప్ ఫైర్, కార్యకలాపాలు ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు గోండుగూడ క్యాంపులో డిన్నర్ ఉం టుంది. 13న ఉదయం 5.30 గంటలకు అన్ని బృందాల వారు పక్షులను చూసే ప్రదేశాలకు చేరుకుంటారు. అక్కడే ఉదయం 8.30 గంటలకు అల్పాహారం అందిస్తారు. 10.30 గంటలకు ము గించి తిరిగి శిబిరాలకు చేరుకుంటారు. 11.30 గంటలకు ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అనంతరం ఎఫ్‌డీవో చేతులమీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేస్తా రు. 12.30 గంటలకు సీసీఎఫ్ ముగింపు వ్యాఖ్య లు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు టీడీసీలో భోజన సదుపాయం కల్పించారు. అనంత రం 2.30 గంటలకు వారు బయలుదేరుతారు.