నార్నూర్ : సీజనల్ వ్యాధుల ( Seasonal diseases ) నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సామాజిక ఆరోగ్య ఆసుపత్రి వైద్య అధికారి జితేందర్ రెడ్డి ( Jitender Reddy ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని నాగల్ కొండ, ముస్లిం వాడ, మల్కు గూడా, తాడిహత్నూర్, బీసీ వాడ, గుంజాల తో పాటు పలు గ్రామాల్లో ఆదివారం రాపిడ్ ఫీవర్ సర్వే ( Fever survey ) నిర్వహించారు.
స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రామాల్లో అపరిశుభ్రత లోపించకుండా చూడాలని స్థానికులకు సూచించారు.
చిన్నపాటి జ్వరం దగ్గు జలుబు ఉన్న ఆసుపత్రికి వచ్చి వైద్య చికిత్సలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి తులసీదాస్, ఆరోగ్య పర్యవేక్షకులు చౌహాన్ చరణ్ దాస్, సత్యావ్వ, వైద్య సిబ్బంది ప్రియాంక, సింధు, విమల, మానుకు బాయ్, ఈశ్వర్, జవహర్ లాల్, ఆడే దినేష్, గోకుల్, ఆశా కార్యకర్తలు సరిత, బజ్జు బాయి, రుక్మాబాయి, సుగుణ, లక్ష్మి, శ్రీలత ఉన్నారు.