బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను ( Sorghum Crop) కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా ( Farmers Dharna ) నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జొన్న కొనుగోలు చేసి వారం గడిచినా కూడా లోడింగ్ చేయకపోవడంతో వర్షానికి 7వలే మొక్కజొన్న సంచులు తడిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జొన్న పంట ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు దుబ్బుల చంద్రశేఖర్, దంగరి రాములు, ప్రభాకర్, తోకల రాజన్న, అనుము సాయన్న, అగ్గునందు ధనుంజయ్, ఫరీద్ ఖాన్, లక్కం శంకర్, సోం రామ్ రెడ్డి, లక్కం శ్రీనివాస్, గంట చిన్నయ్య, మారుతి, తడక శ్రీనివాస్, దన్నగర్ పండరి, సుది వినాయక్, తదితరులు పాల్గొన్నారు.