తాండూర్ : ప్రతి రైతు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు, సాగు నీటి సేకరణ గూర్చి అవగాహన ( Farmers Awareness ) పెంచుకోవాలని వ్యవసాయాధికారి కే సుష్మ ( Susma ), పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు (College students) అన్నారు.
వ్యవసాయ అనుభవ పూర్వక అభ్యసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తపల్లి గ్రామంలో భూసార పరీక్షలు (Soil tests ) , సాగు నీటి (Irrigations)సేకరణ గురించి జగిత్యాల జిల్లా పొలాస లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన చివరి సంవత్సరం విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు.
రైతులు వేసే పంటలకు, వ్యవసాయ భూమిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇంకా ఏ పోషకాలు అవసరం అనేది మట్టి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. భూసార పరీక్షల చేయించడంతో భూమిలో మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు.
రైతులు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో ఏ నేలలో ఏ పంటలు వేసుకోవాలో తెలుస్తుందన్నారు. అనంతరం ఏఈవోలు ఉప్పులేటి శంకర్, ఎం వెంకటేష్, వివి ధనలక్ష్మి, గ్రామ రైతులతో కలిసి మట్టి నమూనాను సేకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దుర్గం శ్రీధర్, చొప్పదండి తిరుపతి, రైతులు చొప్పరి సారయ్య, కొడిపె విమల, రైతులు పాల్గొన్నారు.