తాండూర్ : కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి (కేవీకే) శాస్త్రవేత్తలు(Agricultural scientists ) శుక్రవారం తాండూరు మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయంలో నూతన విధానాలు, ఎరువులు, రసాయనాలు, నీటి వినియోగాన్ని వివరించారు. భూసార పరిరక్షణ, పంట మార్పిడి, మార్కెటింగ్, వివిధ తోటల పెంపకం, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, నగరాజు, బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్ మాట్లాడుతూ ఎరువులను అధికంగా వాడితే భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుం దని అన్నారు. వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తే అధిక లాభాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుష్మ, ఏఈవో శంకర్, నాయకులు పాల్గొన్నారు.