దండేపల్లి, మార్చి 20 : కడెం కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడొద్దని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ భరోసానిచ్చారు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం, మాకులపేట గ్రామాల్లో వరి చేలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కడెం నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. పంటల స్థితిగతులపై వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. కడెం నీళ్లు చివరి ఆయకట్టు పంటలకు వచ్చేలా చూడాలని కలెక్టర్కు రైతులు విన్నవించగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
వరి కాకుండా ఇతర పంటలు సాగు చేసి లాభాలు పొందాలని రైతులకు సూచించారు. ఒకటే పంట సాగుతో భూసారం దెబ్బతినడంతో పాటు దిగుబడులు తగ్గుతాయని తెలిపారు. దండేపల్లిలోని ఇంట ర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షల ఏర్పాట్లను ఎంఈవోను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ప్రసాద్, డీటీ విజ య, ఏవో అంజిత్కుమార్, ఆర్ఐ భూమన్న, ఏఈవో శ్రీకన్య, తదితరులున్నారు.