బోథ్ : కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను రైతులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోవస్తున్నా రైతుల కనీసం ఆలోచించపోవడంతో రైతులు పంట సాగు మొదలు పెట్టిన నాటి నుంచి విక్రయించేందుకు మార్కెట్‌కు తరలించేంతవరకు అడుగడుగునా అపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వాన్ని, అధికారులను అడుగడుగునా నిరసన తెలుపుతున్నారు.
ఆదిలాబాద్( Adilabad ) జిల్లా బోథ్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన నిర్వహించారు. సోయాబీన్‌ను ( Soybeans ) కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ , మార్కెటింగ్ అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో రైతులతో మాట్లాడుతుండగా బయట నుంచి గేటుకు తాళం వేశారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సోయాబీన్ ను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.