బేల, మే 8 : గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచకుండా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారు ? అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను రైతులు నిలదీశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని మారెట్ యార్డులో జొన్నల కొనుగోలు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మారెట్ యార్డులో గన్నీ బ్యాగ్‌లు లేవని, వాటిని అధికారులు సమకూర్చేవరకూ కొనుగోళ్లు ప్రారంభించవద్దని ఎమ్మెల్యేను రైతులు, నాయకులు అడ్డుకున్నారు.
దీంతో ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కొనుగోలు కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకోవడం కాదని, దగ్గరుండి పూర్తి స్థాయిలో పంటలు కొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ డీఎంతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి గన్నీ బ్యాగులు సమకూర్చాలని ఆదేశించడంతో రైతులు శాంతించారు.