గ్లాస్గోవ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు అప్పుడే ఓ పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్(Boxer Lovlina)కు పతకం దక్కనున్నది. దీంతో గ్లాస్గోవ్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం దాదాపు ఖాయమైంది. బాక్సింగ్‌లో లవ్లీనా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమెకు బై దక్కింది. దీంతో ఆమె నేరుగా సెమీస్‌కు వెల్లింది. జూలై 31వ తేదీన జరగనున్న సెమీస్‌లో తాఫకితో ఆమె తలపడుతుంది.ఒకవేళ సెమీస్‌లో ఓడినా.. లవ్లీనాకు మాత్రం కనీసం కాంస్య పతకం దక్కనున్నది. కామన్వెల్త్ క్రీడల్లో ఇంకా ఓపెనింగ్ సెర్మనీ కూడా జరగకముందే ఇండియాకు పతకం ఖాయం కావడం గమనార్హం. రింగ్‌లోకి ఎంటర్ కాకముందే ఆమెకు పోడియంలో చోటు దక్కిందని అధికారులు పేర్కొన్నారు. ఈసారి ఇండియా తరపున కామన్వెల్త్ క్రీడల్లో 124 మంది అథ్లెట్లు హాజరవుతున్నారు. 2022లో జరిగిన క్రీడల్లో ఇండియా ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే.
🚨 INDIA’S FIRST MEDAL CONFIRMED!
India’s first medal at the Commonwealth Games 2026 is confirmed 🇮🇳
Lovlina Borgohain receives a bye into the semifinals, guaranteeing herself at least a bronze medal. 🥊
She will face T.K.B.P. Taafaki on 31 July for a place in the final. 🔥… pic.twitter.com/jMvR7OCzMM
— Bharat On Field (@Bharat_OnField) July 23, 2026