OU Students | ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గులేకుండా పార్లమెంట్లో నవ్వుతూ కూర్చున్నాడు.. విద్యార్థి నాయకురాలు ఫైర్.. వీడియో
OU Students | మన దేశంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్న కాలంలో మన దేశంలోఉన్న పరీక్షా విధానం పూర్తిగా కుళ్లిపోయింది. ప్రతీ సారి అవినీతి జరుగుతోంది.. పేపర్ లీకులు జరుగుతున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు ఫైర్ అయింది.
OU Students | హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి నాయకురాలుమాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో దేశవ్యాప్తంగా యువత కొన్ని డిమాండ్లతో అక్కడకు చేరుకున్నారు. మన దేశంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్న కాలంలో మన దేశంలోఉన్న పరీక్షా విధానం పూర్తిగా కుళ్లిపోయింది. ప్రతీ సారి అవినీతి జరుగుతోంది.. పేపర్ లీకులు జరుగుతున్నాయని ఫైర్ అయింది.
ఈ సంవత్సరం నీట్ స్కాం కారణంగా 22 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ కోట్లాదిమంది డిమాండ్ చేస్తున్నా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్లో నవ్వుతూ కూర్చున్నాడు.
రెండు రోజుల క్రితం వేలాది మంది ఢిల్లీలో రోడ్లపైకి వచ్చి మేం పార్లమెంట్ వైపు వెళ్తాం. మా నిరసన మేం తెలుపుతామంటే వాళ్లపై టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా లాఠీచార్జి కూడా చేశారు. ఆడవాళ్లను మగపోలీసులు వాళ్లను లాగి బట్టలు చింపి వాళ్లను హింసించారు. వందలాది మంది ఇంకా ఆస్పత్రుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల గురించి అవసరం లేదు కేవలం మా పదవులు, వ్యాపారుల ఆస్తులే ముఖ్యం అన్నట్టు కేంద్ర ప్రభుత్వ తీరు ఉన్నదని మండిపడ్డది.
22 మంది NEET విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే రాజీనామా చేయాల్సిన బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ మీద లేదా?
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన
కోట్లాది మంది రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా ధర్మేంద్ర ప్రధాన్… https://t.co/PMyEdPlqQN pic.twitter.com/QnqJBYJktD
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
Read Also :
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

