Tirumala | తిరుమలలో హనుమంతుడి విగ్రహాన్ని దొంగిలించిన నిందితుడి అరెస్ట్
Tirumala | తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
తిరుమల : తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల( Tirumala ) మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని ( Hanuman Idol ) పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు ( Arrest ) చేశారు. బుధవారం తెల్లవారుజామున గోవిందమాల ధరించిన భక్తుడు జశ్వంత్కుమార్ హనుమంతుడి చిన్న విగ్రహాన్ని చోరీ చేసి పారిపోయాడు.
ఆలయం వద్ద అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విశాఖపట్నానికి చెందిన జశ్వంత్ కుమార్గా నిర్ధారించుకున్నారు. చోరీ అనంతరం అతను యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించి వెంటనే ఒంగోలు జీఆర్పీ పోలీసులను అప్రమత్తం చేశారు.
నిందితుడిని ఒంగోలు స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి విగ్రహాన్ని తిరుమలకు తీసుకొచ్చి తిరుమల, తిరుపతి దేవస్థానం సంప్రదాయాల ప్రకారం హనుమంతుడి విగ్రహానికి పుణ్యాహవచనం చేసి పునఃప్రతిష్టించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

