Maruti Suzuki | మారుతీ సుజుకి కి చెందిన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారును కంపెనీ రేపు (జూలై 24) విడుదల చేయనున్నది. దీనిలో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. కారు అభిమానులు ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో బ్రెజ్జా ఒకటి. ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఈ కారుకు సంబంధించిన ఫొటోలను చూస్తే డిజైన్ ఇదివరకటి బ్రెజ్జాలాగే కనిపిస్తుంది. కానీ ముందు భాగంలో కొన్ని మార్పులు చేశారు. దీనికి కొత్తగా గ్రిల్‌ను ఏర్పాటు చేసి, బంపర్‌ను మార్చారు. హెడ్‌లైట్, డీఆర్ఎల్ (Daytime Running Lights)లో స్వల్ప మార్పులు చేశారు.
అలాయ్ వీల్ కొత్తగా వచ్చే అవకాశం ఉంది. వెనుకవైపు బంపర్, టెయిల్ లైట్, లోపలి భాగాల్లో కూడా స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దీనిలో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ వేరియంట్ ఉన్నాయి.
ఇంకా దీనిలో ఆటో-డిమ్మింగ్ IRVM, అటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు ఉండవచ్చు. దీంతో ఈ కారు టాటా నెక్సాన్ (Nexon), మహీంద్రా ఎక్స్‌యూవీ, హ్యుందాయ్ వెన్యూ (Venue) వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.