కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ లింగాపూర్, మార్చి 12 : జిల్లాలో ఈ యాసంగిలో వేసిన పంటలపై ఇక రైతాంగం ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలు పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతుండగా, చెరువులు, బోర్లపై ఆధారపడి వేసుకున్న పంటలు చేతికందకుండా పోయే దుస్థితి వచ్చింది. ఇక కొన్నిచోట్ల బోర్లు, బావుల్లో కొద్దిపాటి నీరున్నా కరెంట్ కోతల వల్ల ప్రయోజనం లేకుండా పోతున్నదని కర్షకలోకం కన్నీరు పెట్టుకుంటున్నది.
6050 ఎకరాల్లో జొన్న సాగు..
జిల్లాలో ఈ యాసంగిలో 6050 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. మార్చి నెలాఖరుకల్లా పంట కోత ప్రారంభమవుతుం ది. ఈ సమయంలో నీళ్లు సరిపడా అందించాల్సి ఉం టుంది. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు కరెంట్ కోతల వల్ల పంటలకు నీరందించుకోలేని పరిస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నారు. వానకాలంలో సరైన దిగుబడి రాక నష్టాల్లో ఉన్న రైతులు ఈ యాసంగిలో కూడా మరింత నష్టం పోయే ప్ర మాదమున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శనగ 4 వేలు, మొక్కజొన్న 800 ఎకరాలు, గోధుమ వెయ్యి ఎకరాల్లో సాగు చేయగా, ఈ పంట లు కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి జాదవ్ బాబు. ఈయనది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రం. తనకున్న రెండెకరాల్లో జొన్న పంట వేశాడు. ఎండలు ముదరడంతో బావిలో నీళ్లు అడుగంటి పోయాయి. పొట్ట దశలో ఉన్న పంటకు నీరందించే పరిస్థితి లేకుండా పోయింది. కష్టనష్టాల కోర్చి పెట్టుబడులు తెచ్చి వేసిన పంట చేతికందకుం డా పోయే దుస్థితి వచ్చింది. ఇగ ఇలాగైతే వ్యవసాయం ఎట్లా చేసుడు.. కుటుంబాన్ని ఎట్లా పోషించుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Adilabad4