కొర్రీల కాంగ్రెస్‌కు రైతులే దగిన బుద్ధిచెప్తారని మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు చేపట్టారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. రోడ్లపై బైఠాయించారు. పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని చెప్తూ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు తలో మాటా అంటున్నారని, రుణమాఫీ విషయంలో వారికే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మంచిర్యాల టౌన్, ఆగస్టు 22 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడారు. అన్నంపెట్టే రైతన్నలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రైతులు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. కుంటిసాకులతో కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆగస్టు 15న చేస్తామన్నారని, కానీ, ఇప్పటివరకు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, ఎర్రం తిరుపతి, సాగి వెంకటేశ్వరరావు, అక్కూరి సుబ్బయ్య, పెట్టం లక్ష్మణ్, తాజుద్దీన్, కాటం రాజు, మధు, పల్లపు రాజు, శ్రీరాముల మల్లేశ్, పెంట ప్రదీప్, రమేశ్ యాదవ్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఆగస్టు 22 : దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్లు దండుకునేందుకే హామీలు గుప్పించారని ఆరోపించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, నాయకులు గొట్ల భూమన్న, గోళ్ల రాజమల్లు, ముద్దసాని తిరుపతి, అల్లంల సంతోష్, బొమ్మెన మహేశ్, గొల్లపెల్లి అజయ్, అఫ్సర్, హరీశ్, అంజన్న, ఇసాకర్, సుధాకర్, తిరుపతి, మహిపాల్, రాకేశ్, రాజశేఖర్, ఇస్మాయిల్, తిరుపతి, సాయి, అఖిల్ పాల్గొన్నారు.
హాజీపూర్, ఆగస్టు 22 : హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా రైతులందరికీ రుణమాఫీ చేసేవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గోళ్ల శ్రీనివాస్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, మాజీ ఎంపీటీసీ జాడి వెంకటేశ్, దొనబండ మాజీ సర్పంచ్ జాడి సత్యం, నాయకులు సగాల కిష్టయ్య, బేర పోచయ్య, సామల బుచ్చయ్య పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 22 : బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన ధ ర్నాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆర్డీవో హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, మోసం చేస్తున్నారని విమర్శించారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నాయకులు రేవెల్లి విజయ్, బొప్పు అర్జ య్య, సత్తయ్య, సాజిద్, వాజిద్, తాళ్లపల్లి మల్లయ్య, లింగపల్లి మల్లయ్య, పుల్లూరి మౌనిక్, సుందర్రావు, ఆవుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు మ ర్సకోల సరస్వతి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 22 : కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. ఇక్కడ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు సాధ్యంకాని హామీలు ప్రకటించి, ప్రకటించి రైతులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ శ్యాం రావు, నాయకులు రాజకుమార్, అంబాల ఓదెలు, మోయిన్, ఆవుల కాజ్కుమార్, సలీం పాల్గొన్నారు.
చెన్నూర్, ఆగస్టు 22 : చెన్నూర్ పట్టణంలోని పాత తహసీల్ కార్యాలయం ఎదుట బీఆర్శ్రీస్ నాయకులు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ మల్లికార్జున్‌కు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారమేశ్, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, కోటపల్లి సింగిల్ విండో చైర్మన్ సాంబాగౌడ్, మున్సిపాల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీనివాస్, దోమకొండ అనీల్, భీమారం మండలాధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజ్‌కుమార్ నాయక్, నాయకులు మేడ సురేశ్‌రెడ్డి, విద్యాసాగర్, నాయిని సతీశ్, రత్న సమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
జన్నారం, అగస్టు 22 : జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, ఫజల్‌ఖాన్, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ కమ్మల విజయధర్మ, రవీందర్రావు, పేరం శ్రీను, రైతులు పాల్గొన్నారు.
కాసిపేట, ఆగస్టు 22 : కాసిపేట మండల కేంద్రంలో చేపట్టిన ఆందోళనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ సర్పంచులు ఆడె బాదు, అజ్మీరా తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, పార్టీ కార్యదర్శి మోటూరి వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాస్దేవ్, ఏనుగు మంజులారెడ్డి, లంక లక్ష్మణ్, పెంద్రం హన్మంతు, మచ్చ అశోక్, సుధాకర్ రెడ్డి, దుర్గం సాగర్, శేఖర్, కైలాస్, కరీం, మైసయ్య, రాజేశ్, ఆడె జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, ఆగస్టు 22 : తాండూర్ మండల కేంద్రంలోని ఐబీలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో వాహనలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి, విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, నాయకులు దాగాం నారాయణ, మద్దికుంట రాంచందర్, భోనగిరి చంద్రశేఖర్, గడ్డం మణికుమార్, రావుల స్వామి, సంతోష్, క్రిష్టోఫర్, చింటు, క్రాంతిరావు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, ఆగస్టు 22 : వేమనపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురాణం లక్ష్మీకాంత్, కుబిడె మధూకర్, వెంకటేశం, బాపు, పద్మ, సంతోష్, రాజలింగు, భీమయ్య, సాయి, చరణ్‌రాజ్, రజోక్ తదితరులు పాల్గొన్నారు.
భీమారం, ఆగస్టు 22 : భీమారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి బస్టాండ్ వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. తహసీల్ కారాయలయంలో ఆర్ఐ స్రవంతికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు దాసరి మధునయ్య, నాయకులు భూక్యా రాజ్ కుమార్ నా యక్, కలగూర రమేశ్, పానుగంటి లచ్చన్న, ఆత్కూరి రాము, వేముల శ్రీకాంత్ గౌడ్, వేముల ప్రణీత్ గౌడ్, వడ్లకొండ కిష్టయ్య, భూక్యా రమేశ్ నాయక్, యువ నాయకులు దాసరి మణిదీపక్, భూక్యా రాజేశ్ నాయక్, భూక్యా నవీన్ నాయక్, సోదారి మల్లేశ్, వడ్లకొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఆగస్టు 22 : కన్నెపల్లి తహసీల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకలు రాస్తారోకో చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, నియోజకవర్గ అధ్యక్షుడు జిల్లెల్ల మహేశ్‌గౌడ్, మాజీ ఎంపీపీ కర్రె శంకర్, మాజీ సర్పం చ్ పుల్లూరి రాజయ్య, నాయకులు భీమయ్య, అశోక్, రాములు, గణేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల, ఆగస్టు 22 : నెన్నెల తహసీల్దార్‌కు బీఆర్ఎస్ మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం, సున్నం రాజు, మాజీ సర్పంచ్‌లు మల్లేశ్, శంకర్, సత్యనారాయణ, బాపు, మల్లయ్య, మాజీ ఎంపీటీసీ తిరుపతి, శ్రీనివాస్, చీర్ల మొండన్న, అంజన్న, అరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, అగస్టు 22 : జైనూర్ మండల కేంద్రంలోని ప్రధా రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కుమ్రం భీం చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, మాజీ ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీలు కుమ్ర భగ్వంత్ రావు, ఆత్రం జుగది రావు, మాజీ సర్పంచులు మడావి భీమ్రావ్, మెస్రం నాగోరావ్, కుమ్ర కేశవ్, ఆత్రం సాయాజీ రావ్, గెడం లక్ష్మి నరహరి, నాయకులు మెస్రం అంబాజీ, ముండే సతీశ్, పెందూర్ లచ్చు, మెస్రం నాగోరావ్, నారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, ఆగస్టు 22 : వాంకిడి మండల కేంద్రంలోని నాగ్‌పూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్ ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏఎంసీ చైర్మ న్ జబోరే పెంటు, మాజీ సర్పంచ్ బండే తుకారాం, ఖమాన మాజీ ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ వినోద్, నాయకులు ఎం అశోక్, ఎంగిలి రాకేశ్, రాజ్‌కుమార్, గౌరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, ఆగస్టు 22 : తిర్యాణి మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి,బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యం రాజయ్య, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు ఆత్రం చంద్రశేఖర్, వెడ్మ కమల, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బొమ్మగోని శంకర్ గౌడ్, గాయెంగి మల్లేశ్, సామనపల్లి బ్రహ్మం, పొలాస రమేశ్, కిలిశెట్టి శంకరయ్య, మాసాడి రామన్న, పులి అర్జున్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, ఆగస్టు 22 : కెరమెరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ గోడం సంతోష్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఇక్కడ మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు రూప్‌లాల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ రిజ్వాన్, కుమ్రం భీంరావ్, తొడసం జగన్నాథ్రావ్, కేంద్రె జాలాజీ, కంబాల వినేశ్, కుడ్మెత సోము, షేక్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.