బోథ్/ముథోల్/ఇంద్రవెల్లి/బజార్హత్నూర్, జూలై 3: రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. గురువారం బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్దకు తరలివచ్చారు. దాదాపు 130 మందికిపైగా వచ్చారు. ఆధార్ కార్డులు చేత పట్టుకుని వరుసలో వేచి ఉన్నారు. ప్రతి రైతుకు ఐదు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. దాదాపు 89 మందికి 444 బస్తాలు పంపిణీ చేయగా.. మిగతా వారు వెనుదిరిగారు. మరో వైపు సొనాలలో కూడా వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు దగ్గరుండి పంపిణీ చేయించారు. ప్రస్తుత తరుణంలో పత్తి, సోయా పంటలకు యూరియా తప్పనిసరి. ఈ మేరకు యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.
ముథోల్‌లో పీఏసీఎస్ వద్ద బుధవారం ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. అయితే పీఏసీఎస్‌కు 900 బస్తాలు రాగా.. ఒక్కో రైతుకు ఐదు బస్తాలను పంపిణీ చేశారు. మరికొంత మంది దొరుకక వెనుదిరిగారు. ప్రభుత్వం అవసరం మేర సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం రైతులు బారులుదీరారు. యూరియా వస్తుందనే విషయం తెలుసుకున్న దాదాపు 40 గ్రామాలకు చెందిన 200 మంది తరలివచ్చారు. ఒక్కొక్కరికి ఐదు బ్యాగుల చొప్పున 177 మందికి పంపిణీ చేశారు. మిగతా వారు దొరుకక పోవడంతో వెనుదిరిగారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి ఎరువుల కొరత లేకుండా సకాలంలో అందించాలని విన్నవించారు.
బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం గురువారం రైతులతో కిక్కిరిశా యి. భూతాయి, ఉమార్డ, పిప్పిరి, దేగామ, టెంబి, మాన్కపూర్, బజార్హత్నూర్, కోల్హారి, భోస్రా, ది గ్నూర్ గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. పీఏసీఎస్‌కు రెండు లారీల్లో 888 బ్యాగులు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 444 బ్యాగులు రావడంతో రైతులు ఆధార్ కార్డు, పట్టా పాసుబుక్ జిరాక్స్‌లతో పడిగాపులు కాశారు. దీంతో ఒక్కొక్కరికి ఐదు బ్యాగుల చొప్పున 266 మందికి అందించారు. దీంతో మిగతా రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగిగారు.
వానకాలం సాగుకు ముందే ప్రభుత్వం స మాయత్తం కావాలి. స రిపడా ఎరువులను రైతు లకు అందుబాటులో ఉంచాలి. కాంగ్రెస్ సర్కా ర్కు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబా టులో ఉండేవి. నేడు ఎక్కడ చూసిన సరిపడా స్టాక్ ఉండకపోవడంతో రైతులు పనులు వదు కుని క్యూలో ఉంటున్నారు.
– డుబ్బుల చంద్రశేఖర్, యువ రైతు, బజార్హత్నూర్