తాండూర్ : బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ( MLA Vinod ) చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు ( False allegations ) చేస్తున్నారని కాంగ్రెస్ తాండూరు మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ అన్నారు. తాండూరు ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాకా కుటుంబం బెల్లంపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణలో భాజపా స్థానం ఏంటో జూబ్లిహిల్స్ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. అలాంటి వారు అధికార పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక, ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందిళ్ళ భూమయ్య, మాసాడి తిరుపతి, తాండూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెట్టెం విష్ణు కళ్యాణ్, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంతెన శివ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.