ఇచ్చోడ, మే 24 : ఇస్లాంనగర్కు చెందిన జాదవ్ గజానంద్ ఇంట్లో టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహించి తొమ్మిది నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ తెలిపారు. జాదవ్ గజానంద్ను విచారించగా కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి 18 ప్యాకెట్లను విక్రయించినట్లు తెలిపారు. అనంతరం కోకస్మన్నూర్ గ్రామంలో విచారణ చేయగా కాండ్లి శివకుమార్ వద్ద ఆరు ప్యాకెట్లు, లోట్టపెల్లి రవీందర్ వద్ద 12 ప్యాకెట్లు లభించాయని తెలిపారు.
ముక్రా(బీ) గ్రామానికి చెందిన అడావ్ రవికాంత్ మహారాష్ట్ర నుంచి వీటిని తెచ్చి జాదవ్ గజానంద్ ద్వారా అమాయక రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రవికాంత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఇచ్చోడ ఏవో రమేశ్, టాస్క్ ఫోర్స్ టీమ్ సిబ్బంది ఉన్నారు.