ఎదులాపురం, మే 7 : కారులో మౌళి 5జీ పేరిట నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న విక్రేతను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 150 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ)కి చెందిన అడావు రవికాంత్‌ను టాస్ ఫోర్స్ బృందం పట్టుకొన్నట్లు తెలిపారు.
విచారణలో గుజరాత్ రాష్ర్టానికి చెందిన రజత్ పటేల్ నుంచి కొనుగోలు చేసి రైతులకు విక్రయించేందుకు ఆదిలాబాద్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. మండల వ్యవసాయ అధికారి కాటిపెల్లి నాగేశ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇందులో వన్ టౌన్ ఎస్సై నాగనాథ్ పాల్గొన్నారు.