ఆదిలాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనుంది. నేటి(గురువారం)తో జడ్పీటీసీలు, రేపటి(శుక్రవారం)తో ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకా లం పూర్తికానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల కోసం చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యం కానుం ది. ఇప్పటికే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఫిబ్రవరి 1 నుంచి కొనసాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేంత వరకు ప్రత్యేకాధికారులు ఉంటారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా పరిషత్‌కు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండగా మండలాలకు వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాలోని 2019 లో 17 మండలాల జడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. 9 మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలతోపాటు 83 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. జడ్పీ చైర్మన్ పదవితోపాటు 11 ఎంపీపీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎంపీటీసీ లు, జడ్పీటీసీల పాత్ర కీలకం. పదవీకాలం ము గుస్తున్న మండల పాలక వర్గాలకు జిల్లాలో అ ధికారులు,ఎమ్మెల్యేలు సన్మానాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 468 గ్రామ పంచాయతీల్లో ఐదు నెలల నుంచి ప్రత్యేకాధికారుల పా లన కొనసాగుతున్నది. పంచాయతీల పరిధి ప్ర కారం నాలుగైదు, పంచాయతీలకు కలిపి ప్రత్యేకాధికారులను నియమించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తమ సొంత శాఖకు సం బంధించిన పనులను చూడడంతోపాటు పం చాయతీల పనులపై దృష్టి సారించడం కష్టంగా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్ర గతి, ఇతర కార్యక్రమాలను చేపట్టి గ్రామాల అ భివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకున్నది.
కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఇప్పు డు మండలాల్లో సైతం ప్రత్యేకాధికారుల పా లన కొనసాగనుండడంతో పర్యవేక్షణ కొరవడి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టా న్ని తీసుకొచ్చింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పదేండ్లపాటు రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను మారుస్తుందా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.