ఖానాపూర్ రూరల్, మే 25 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సేవ్యనాయక్తండాలో గురువారం ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు.
గ్రామానికి చెందిన కొర్ర కళావతి, ఇదే తండాకు చెందిన బిలావత్ పద్మ ఇంట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ రాయబారపు రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో నరేందర్ గౌతమ్, వెంకటేశ్, కల్పన పాల్గొన్నారు.