ఆదిలాబాద్ : రేపటి తరం భవిష్యత్ కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. అదిలాబాద్ మున్సిపల్ పరిధి వార్డ్ నెంబర్ 14 సంజయ్ నగర్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే రామన్న ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతి – పల్లె ప్రగతి కార్యక్రమాలకు విజయవంతం చేయాలన్నారు. ప్రజా సమస్యలను తీర్చేందుకు తాగునీరు, మురికి కాలువలు, కరెంటు తదితర సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ స్పెషల్ గ్రాంట్ అందిస్తూ ఈ కార్యక్రమాలను చేపట్టారన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయంవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెహిర్ రంజాని, టీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, వాగ్మారే సైలెందర్, వార్డు కౌన్సిలర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ శైలజ, వై పోతా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహేందర్ యాదవ్, పూసం ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.