
ఆదిలాబాద్ రూరల్, జనవరి 20: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ కొవిడ్ టీకా వేయించాలని డీఈవో టామ్నె ప్రణీత సూచించారు. పట్టణంలోని మండల రిసోర్స్ కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్తి జాబితాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలల వారీగా వ్యాక్సినేషన్‌కు అర్హులైన విద్యార్థులెందరు, టీకాలు వేసుకున్నది ఎందరు, ఇంకా టీకాలు వేసుకోవాల్సిన వారి వివరాలు సీఆర్పీలు సిద్ధం చేసి, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు. ఆమె వెంట ఏఎస్వో సూరజ్ రావ్ ఉన్నారు.
ఇచ్చోడ, జనవరి 20 : ఇచ్చోడలోని వివేకా నంద డిగ్రీ కళాశాల విద్యార్థులకు గురువారం కొవిడ్ టీకాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ నిఖినీ వర్మ, కరస్పాండెంట్ రాజేశ్వర్ రెడ్డి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.