రోడ్డెక్కిన అన్నదాతలు
‘వడ్లు తూకం 15 రోజులైనా గోదాము కు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతాం మేడం.. లారీలు పంపండి’ అంటూ నెన్నెల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు..కలెక్టర్ సారు కాళ్లు’ మొక్కండి..’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానంపై రైతు లు మండిపడ్డారు. ఆమె మాటలను కొందరు వీడియో లు తీసి సోషల్ మీడియా గ్రుపులలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.
- లారీల కోసం నెన్నెల, వేమనపల్లి మండలాల్లో రాస్తారోకోలు
నెన్నెల, మే 20 : ‘వడ్లు తూకం 15 రోజులైనా గోదాము కు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతాం మేడం.. లారీలు పంపండి’ అంటూ నెన్నెల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు..కలెక్టర్ సారు కాళ్లు’ మొక్కండి..’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానంపై రైతు లు మండిపడ్డారు. ఆమె మాటలను కొందరు వీడియో లు తీసి సోషల్ మీడియా గ్రుపులలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. బుధవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మం డలం గొల్లపల్లిలో తూకం వేసిన వడ్లను తరలించేందుకు లారీలు పంపడం లేదని రైతులు వడ్ల బస్తాలను రోడ్డుకు అడ్డంగా ఉంచి బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ విషయం తెలుసుకుని ఆర్ఐ సూలోచన అక్కడికి వెళ్లా రు. ఆమెను రైతులు ప్రాధేయపడగా ఆమె వ్యాఖ్యలపై రైతులు మండిపడ్డారు. ఇప్పటి వరకు గ్రామంలో నాలు గు వేల బస్తాల వడ్లను కాంటా వేయగా రెండు లారీల బస్తాలనే రైస్‌మిల్లులకు తరలించారని రైతులు తెలిపారు. మిగతా బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదన్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, నెన్నెల ఎస్ఐ రామకృష్ణ అక్కడికి వెళ్లి రైతులను సముదాయించినా వినలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి లారీలను పంపడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
లారీలు రావడం లేదని రైతుల ధర్నా
వేమనపల్లి, మే 20 : ఐకేపీ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను తరలించేందుకు వారం రోజులుగా లారీలు రావడం లేదంటూ బుధవారం వేమనపల్లి మం డల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు. చెన్నూరు నుంచి వేమనపల్లి గోదాముకు వచ్చిన సుమారు 20 లారీల వడ్లను అడ్డుకొని నిరసన తెలిపారు. తహసీల్దార్ సాయికృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి వచ్చి సముదాయించినా వినలేదు. కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వచ్చి మాట్లాడారు. లారీలను త్వరగా పంపిస్తామని, జూన్ 10 వరకూ రైతుల నుంచి పూర్తి స్థా యి వడ్లు కొని మిల్లులు, గోదాములకు తరలిస్తామని హా మీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. జిల్లాలో గోదాము లకు వడ్లను తరలించే లారీలను అడ్డుకునే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

