లక్షెట్టిపేట,సెప్టెంబర్ 12 : మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రాధాన్యమిస్తున్నదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం ఐదు క్యాంటీన్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం కలెక్టర్ కార్యాల యం వద్ద ఇటీవల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణంలో కూడా ప్రజలకు అందుబాటు లో తీసుకువస్తామన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం క్యాంటీన్లు, మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేయడమేగాక స్కూల్ యూనిఫాంల కుట్టు పని కూడా అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతకు మందు పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో మిల్క్ పార్లర్‌ను కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, అడిషనల్ ఆర్డీవో వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి స్వప్న, ఎంపీడీవో సరోజ, ఎంపీవో శ్రీనివాస్, ఎపీవో వెంకటరమణ, ఎపీవో విజయలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్, సెప్టెంబరు 12 : మహిళా సంక్షేమంలో భాగంగా గ్యాస్ రాయితీ కల్పించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో గణపతితో కలిసి గ్యాస్ రాయితీపై సమావేశం నిర్వహించారు. రేషన్ డీలర్లకు గ్యాస్ రాయితీ పత్రాలు అందించారు. గ్యాస్ సిలిండర్ పొందిన నాలుగు రోజుల్లో రాయితీ డబ్బులు జమకాని పక్షంలో వివరాల కోసం 1967, 180042500333 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
కాసిపేట, సెప్టెంబర్ 12 : మంచిర్యాలను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కాసిపేట మండలం ధర్మారావుపేట, మలపల్లి, దేవాపూర్ గ్రామాల్లో జిల్లా వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాస్యులను 100 రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. కుట్టు శిక్షణ ద్వారా జీవనోపాధి పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, డివిజనల్ పంచాయతీ అధికారి సప్టర్ అలీ, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, సెక్టర్ అధికారి సత్యనారాయణమూర్తి, లయన్స్ క్లబ్ సఖీ అధ్యక్షుడు బండ శాంకరి, డీఆర్పీలు పోకల వెంకటేశ్వర్లు, ఎర్ర సువర్ణ, కొండు జనార్దన్, కందుల తిరుపతి, సుమన్ సమన్వయకర్తలు సంధ్య, ధనలక్ష్మి పాల్గొన్నారు.