మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 8: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, వాచ్మెన్, పీస్‌రేట్, ఎస్పీఎం, బిల్లింగ్ కార్మికులు బుధవా రం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ వి ద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాలలోని విద్యుత్ శాఖ ఎస్ ఈ కార్యాలయం ఎదుట జిల్లాలోని దాదాపు 300 మంది ఆర్టిసన్, ఇతర విభాగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా నాయకుడు మాట్లాడు తూ ఆర్టిసన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ నిబంధనలు అ మలు చేయాలని, విద్యార్హతలను బట్టి అర్టిసన్లను కన్వర్షన్ చేయాలని, ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకే రూల్స్ వర్తింపజేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిసన్లుగా గుర్తించాలని, పీస్‌రేట్ కార్మికులను జీవో నం 11 ప్రకారం వేతనాలు అందించాలని, 2016 కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారిలో అర్హతలను బట్టి ఆర్టిసన్లుగా గుర్తించాలని, 2026 వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ పసుల తిరుపతి, కన్వీనర్ తోట నగేశ్, కో చైర్మన్ ఉప్పులేటి నరేశ్, కో కన్వీనర్ చిందం వెంకటేశ్, గుండపు శ్రీనివాస్, నల్ల దేవేందర్, గొర్రె రమేశ్, జీ శ్రీనివాసరెడ్డి, ఎండీ ఉస్మాన్, ప్రశాంతి, బుజ్జి, రాధిక, శైలజ, అంజయ్య, పాల్గొన్నారు.