ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 7 : పట్టభద్రుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ. నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనును గెలిపించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని, తన జీతాన్ని పేద విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతానన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం నవంబర్ 1 నుంచి ఉచితంగా యాప్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గెస్ట్, కాంట్రాక్ట్, రెగ్యులర్ అధ్యాపకుల సమస్యల పరిషారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, పట్ట భద్రులు తదితరులు ఉన్నారు.