శ్రీరాంపూర్, మార్చి 29 : సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గనిని కమిషన్ సభ్యులు రేనికుంట్ల ప్రవీణ్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్లు ఆర్కే న్యూటెక్ గనిని సందర్శించారు.
జీఎం ఎం శ్రీనివాస్, అధికారులు స్వాగతం పలికారు. పలు సమస్యలపై నాయకులు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, రేనికుంట్ల ప్రవీణ్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయ క్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌ను ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతులా, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంతోటి నాగేశ్వర్రావు సన్మానించి, సమస్యలపై విన్నవించారు.
ఎస్టీపీపీలో పర్యటన
జైపూర్, మార్చి 29: జైపూర్ విద్యుత్కేంద్రంలో శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బింగి వెంకటయ్య సభ్యులతో కలిసి పర్యటించారు. అధికారులు అడ్మిన్బిల్డింగ్లో సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్టీపీపీ మైల్డ్‌స్టోన్ నుండి విద్యుత్ ఉత్పత్తితో పాటు సాధించిన విజయాలు, ఎస్టీపీపీ గడించిన లాభాలు విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారనే అంశాలను క్లుప్తంగా వివరించారు. 1300 కార్మికుల్లో ఎస్సీ, ఎస్టీలు శాతం ఎంతో చెప్పాలని చైర్మన్ కోరగా 30 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో 24 మంది ఎగ్జిక్యూటివ్‌లుగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీపీపీ గేట్ ముందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నాయకులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సబ్యులు కుస్రం నీలాదేవి, నేనావత్ రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, రేణిగుంట్ల ప్రవీణ్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, ఎస్టీపీపీ ఈడీ శ్రీనివాసులు, ఓఅండ్ఎం చీఫ్ జెన్సింగ్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.