కుంటాల, జూలై 2 : బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం కుంటాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతిపక్షాలను తరిమికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గంగామణీబుచ్చన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట దశరథ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన గదుల ప్రారంభం
కుంటాలలోని గజ్జలమ్మ ఆలయంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జుట్టు నారాయణ, జుట్టు నరేందర్ జ్ఞాపకార్థం ఆలయంలో నిర్మించిన రెండు వసతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వసతి గదులు నిర్మించిన దాతలను అభినందించారు. దాతల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు ప్రహరీ, రాజగోపురం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణానికి రూర్బన్ ద్వారా కోటి రూపాయలతో పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ, ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు జుట్టు గజేందర్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్క గజ్జారాం,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, సర్పంచ్ సమతావెంకటేశ్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, వైస్‌ఎంపీపీ మౌనికానవీన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట రఘు, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట దశరథ్, భైంసా రూరల్ సీఐ నైలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కుంటాలకు చెందిన బోనగిరి గంగవ్వకు రూ. లక్ష, కాండ్లి భూమన్నకు రూ. 45 వేలు, అంబకంటి గ్రామానికి చెందిన చంద్రమౌళికి రూ. 10 వేలు, అనురాధకు రూ. 23 వేలు, లక్ష్మికి రూ. 39 వేలు, అందకూర్ గ్రామానికి చెందిన మానసకు రూ. 55 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరయ్యాయి. ఆదివారం కుంటాలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్‌లకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రవీణ్ కుమార్, దాసరి కిషన్, హైమద్, నాయకులు వెంకటేశ్, ముత్యంరావు, పెంట దశరథ్, దొంతుల శివాజీ, ఇంద్రారెడ్డి, తాటి మహేశ్వర్, గజేందర్, రాకేశ్, అనిల్ కుమార్, మహిపాల్, సాయన్న, దత్తు, తదితరులు పాల్గొన్నారు.