అంబరాన్నంటేలా దసరా సంబురాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఆలయాల్లో పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో శమీ పూజలు నిర్వహించారు.
- ఊరూరా ఘనంగా వేడుకలు
- భక్తిశ్రద్ధలతో శమీ , ఆయుధ, వాహన పూజలు
- ఆకట్టుకున్న ‘రామ్‌లీల’లు
- పాల్గొన్న మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 24 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఆలయాల్లో పూజలు చేశారు. భvఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఆలయాల్లో పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో శమీ పూజలు నిర్వహించారు. క్తి శ్రద్ధలతో శమీ పూజలు నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఆయుధ, వాహనాల పూజ జరిపించారు. రాత్రివేళ నిర్వహించిన రాంలీలా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనంతో వేడుకలు ముగిశాయి. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మందమర్రిలో విప్ బాల్కసుమన్, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాంలీలా మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహనానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పలువురు హాజరయ్యారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆర్కెస్ట్రా బృందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ముందుగా దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాషాయ జెండాను ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. భారీ రావణా ప్రతిమను దహనం చేశారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ రవి కిరణ్ యాదవ్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రకాశ్‌రావ్, జిల్లా క్రీడల అధికారి కొరెడ్డి పార్థసారథి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, గౌరవాధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్ వాజే, ప్రధాన కార్యదర్శి మహదేవ్, కోశాధికారి సూర్యకాంత్, ఉపాధ్యక్షులు రేణికుంట్ల రవీందర్, తోట పరమేశ్వర్, బరాడి లచ్చు, లోలపు శ్రీనివాస్, విజయ్, బండారి దేవన్న పాల్గొన్నారు.
ఆర్టీసీ డిపోలో ఆయుధ పూజ
దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ డిపో కార్యాలయంలో మేనేజర్ కె.కల్పన ఆధ్వర్యంలో ఆయుధ పూజను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 24 : మండలంలో దసరా వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళ గ్రామస్తులు డప్పువాయిద్యాలతో తరలివెళ్లి జమ్మి చెట్టు, గ్రామదేవతల ఆలయాల వద్ద పూజలు చేశారు. అలాగే మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. పెన్‌గంగలో దేవీ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
బేల, అక్టోబర్ 24: మండల కేంద్రంతో పాటు డోప్టాల, మసాల, సిర్సన్న, సాంగిడి గ్రామాల్లో జమ్మి చెట్టుకు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
నార్నూర్, అక్టోబర్ 24 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో రైతులు వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లకు పూజలు చేశారు. గ్రామస్తులందరూ ర్యాలీగా జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేశారు.
ఉట్నూర్, అక్టోబర్ 24 : పట్టణంలోని హనుమాన్ మందిరం నుంచి ప్రముఖ పురాతన ఆలయం శ్రీసాయిగురుదత్త, శ్రీరామ మందిరం వరకు హిందూ ఉత్సవ సమితీ ఆధ్వర్యంలో కాషాయ ధ్వజంతో డప్పులచప్పుళ్ల మధ్య శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ శ్రీసాయిగురుదత్త ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకు పూజలు చేశారు. చెడు ప్రతిమను పటాకులతో దహనం చేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఠాకూర్ గోపాల్ సింగ్, ప్రధాన కార్యదర్శి బింగి వెంకటేశ్, సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

