ఎదులాపురం,ఏప్రిల్16: బంద్ పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ వీ ఉమేందర్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ ఒకటో పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 14న అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో అల్లర్లకు కారణమైన వ్యక్తుల్లో బీజేపీ కార్యకర్త షాహిద్ ఉన్నాడని తెలిపారు. ఆయన బీజేపీ నాయకుడు పాయల్ శరత్ (బన్ని) ఫాలోవర్ అని పేర్కొన్నారు. ర్యాలీలో రాత్రి పిట్టలవాడకు చెందిన సాయికిరణ్ ఇతర జెండాలను పట్టుకుని రాగా, కొంతమంది అల్లరిమూకలు అతనిపై దాడి చేశా రు. మరుసటి రోజు మధ్యాహ్నం సాయికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనపై తన్వీర్, షాహిద్, షేక్ ఇర్ఫాన్, షేక్ జీషన్, దాడిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సాక్షులను విచారించామన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ట్లు తెలిపారు. ఈ సమయంలో 150 మంది బీజే పీ కార్యకర్తలు రిమ్స్ దవాఖాన ఎదుట ధర్నా చేసినట్లు తెలిపారు. రిమ్స్‌కు వచ్చే పేషెంట్లకు, అంబులెన్స్‌లు, ఆర్టీసీ బస్సులకు గంటసేపు ఆటంకం కలిగించినట్లు చెప్పారు.
సా యికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు లో ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పినా, బీజేపీ నాయకులు వినకుండా ప్రజలకు అసౌక ర్యం కలిగించారని తెలిపా రు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసే సమయంలో సాయి కిరణ్ కొంద రు వ్యక్తులు వచ్చి ఫిర్యాదులో సూచించిన షాహిద్ అల్లర్లలో లేడని అతన్ని రిమాండ్ చేయవద్దని కోరారు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎం దుకు రిమాండ్ చేయవద్దంటున్నారని అడగ్గా, షాహిద్ బీజేపీ కార్యకర్త అని, పాయల్ శరత్‌కు ఫాలోవర్‌గా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ జ యంత్యుత్సవాల్లో గొడవలు సృష్టించడానికి వీరు ప్లాన్ చేసినట్లు కనపడుతున్నదన్నారు. కేసులో ఉన్న వారిని రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఘర్షణలు సృష్టించడానికి ప్లాన్ చేసిన వారిని కూడా విడచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రిమ్స్‌లో ధర్నా చేసి ఇబ్బందులకు గురిచేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణం లో కొన్ని సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయని, ఎవరు గొడవలు చేశారో తెలుసుకున్న తర్వాత కూడా బంద్‌కు పిలుపునివ్వడం సరికాదన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు న మోదు చేస్తామని, అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.