నార్నూర్, సెప్టెంబర్,8 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారి సంజీవ్ కుమార్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని గిరిజన సంక్షేమ ఆశ్రమెన్నత బాలికల పాఠశాలలో ఝరి ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో పరిశుభ్రత లోపించి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయన్నారు. తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని సూచించారు. వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ వైద్య శిబిరంలో హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్, ఆరోగ్య ప్రవేక్షకుడు ఆడే సంజయ్, వైద్య సిబ్బంది ఉన్నారు.