నార్నూర్, ఆగస్టు 25 : సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని డివిజన్ పంచాయతీ అధికారి ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణికి పలు అర్జీలు రావడంతో బాధితులను అడుగుతూ సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్. ఏపీఎం జాడే రాజారాం, ఎంపీ ఓ సాయి ప్రసాద్, హాయ్ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.