న్యూఢిల్లీ: రియలన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ(Tina Ambani)కి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేయనున్నది. 68 ఏళ్ల టీనా అంబానీని మనీ ల్యాండరింగ్ కేసులో ప్రశ్నించనున్నారు. వాస్తవానికి ఈడీ ముందు సోమవారం హాజరు కావాలని బాలీవుడ్ మాజీ నటి టీనాకు సమన్లు ఇచ్చారు. కానీ ఆమె హాజరుకాలేదు. అయితే ఆ కేసులో మళ్లీ టీనాకు సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
న్యూయార్క్‌లోని మన్‌హటన్‌లో ఖరీదైన లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన కేసులో జరిగిన లావాదేవీలపై ఈడీ ప్రశ్నించనున్నది. ఈ కేసుతో లింకున్న రిలయన్స్ కమ్యూనికేషన్ మాజీ ప్రెసిడెంట్ పునిత్ గార్గ్‌ను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. బ్యాంక్ ఫ్రాడ్‌పై దర్యాప్తు చేపట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది ఈడీ. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపులో జరిగిన ఆర్థిక అవకతవకలపై కూడా సిట్ విచారణ చేపట్టనున్నది.