Dowry Harrasment | ఇంద్రవెల్లి : అదనపు వరకట్నం కావాలని భార్యను వేధిస్తున్న భర్తతోపాటు ఆమె అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు కుమ్రంభీం-అసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బక సునీల్ తెలిపారు శుక్రవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామవాసి అనితకు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఇష్ పూర్ గ్రామ వాసి తగిరే రాయిసింగ్తో 2023లో వివాహమైందని తెలిపారు. మూడు నెలలుగా భర్త రాయిసింగ్తోపాటు అత్తమామలు తగిరే పంచిబాయి, తగిరే హర్ సింగ్‌లు ఆమెను అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. తగిరే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుబ్బక సునీల్ తెలిపారు.