కాగజ్నగర్, మే 18 : ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలు పొందే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా స్థాయి దోస్త్ సహాయక కేంద్రాన్ని(హెల్ప్ లైన్ సెంటర్) ఏర్పా టు చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాల విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే సహాయక కేంద్ర సిబ్బందిని సంప్రదించి పరిషరించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం 7013607011, 9440194179లో సంప్రదించాలని సూచించారు.