మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 23 : రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అం దించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవా రం మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి మంచిర్యాలలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు.
వారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తలసేమియా, సికిల్ సెల్, క్యాన్సర్ రోగులు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఇతర రోగులకు రక్తం అందించి ఆదుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉండే వారంతా ఆరు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఈ క్యాంపులో వంద యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్లు వెల్లడించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అం దజేసి అభినందించారు. ఏసీపీ ప్రకాశ్, సీఐలు ప్రమోద్ రావు, అశోక్ కుమార్, నరేందర్, నరేశ్ కుమార్, రెడ్‌క్రాస్ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సిబ్బంది, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.