చెన్నూర్ టౌన్, మార్చి 4 : రైతులకు ఇబ్బంది కలిగించకుండా, పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీసీఐ అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో సీసీఐ, వ్యవసా య శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతులకు ఇబ్బందులు కలగకుం డా కొనుగోళ్లు ప్రక్రియ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పత్తి విక్రయించేందుకు వచ్చే రైతులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, బ్యాంక్ అనుసంధానం, పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో తేమ, తప్పా వంటి అంశాల్లో పాటించాల్సిన నియమాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, సీసీఐ అధికారులు, ఏఈవోలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాల (ఏసీసీ),మార్చి4 : వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లే కుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, డీఆర్డీవో, బ్యాంకింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా, మారెటింగ్ శాఖల అధికారులు, మెప్మా అధికారులతో కలిసి రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం కొనుగోలు పై సన్నాహక సమావేశం నిర్వహించారు.
జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో 92 కొనుగో లు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 67 కొనుగోలు కేంద్రాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 150 కొనుగోలు కేంద్రా లు, మెప్మా ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించా రు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,320, సా ధారణ రకానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. సన్నరకం, దొడ్డుర కం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేస్తామ ని తెలిపారు.
ఎండల దృష్ట్యా కొనుగోలు కేం ద్రాల్లో రైతుల కోసం నీడ, తాగునీరు, ఓఆర్ఎస్. మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాల ని తెలిపారు.తూకానికి ముందే రైతుల వద్ద అవసరమైన జిరాక్స్‌లు సేకరించి ట్యాబ్‌లలో నమోదు చేసి రసీదు అందించాలని తెలిపా రు. తూకం యంత్రాలు, తేమ శాతం మీట ర్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ల కోసం టెండర్లు ఆహ్వానించి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా మారెటింగ్ అధికారి షహబొద్దీన్, డీఏ వో కల్పన, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జి ల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, రైస్ మిల్ల ర్ల సంఘం అధ్యక్షుడు కాంతయ్య, వైకుం ఠం, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.