మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 12 : ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హెచ్చరించా రు. ప్రైవేట్ దవాఖానల తీరుపై పత్రికల్లో వస్తు న్న వరుస కథనాల నేపథ్యంలో శుక్రవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 18 మేనేజ్మెంట్ ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు, వైద్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని, మీకు.. మెడికల్‌కు ఏం సంబంధమని ప్రశ్నిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా న్ మెడికల్ ఫీల్డ్ వారు హాస్పిటల్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దవాఖాన ల్లో క్వాలిఫైడ్ వైద్యుడు, ట్రైయిన్డ్ సిబ్బంది, స్పెషలిస్టులతో పాటు స్పెషలైజేషన్ బోర్డులు, ధరల పట్టికలు ఉండాలని, డాక్టర్ హాస్పిటల్ లో లేకపోతే అందుబాటులో లేరని బోర్డుల ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు నిర్వహిస్తామని, ఏదైనా ప్రైవేట్ దవాఖాన మీద ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైద్య పరీక్షల పేరిట రోగుల ను ఇబ్బందులకు గురిచేయవద్దని, ఫీజులు కూడా తక్కువ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెమో బూక్య వెంకటేశ్వర్లు, వైద్యులు పాల్గొన్నారు.