మంచిర్యాల ఏసీసీ, జూన్ 14 : ప్రతిఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కోరారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల వైద్య, ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు రామకృష్ణాపూర్, కాజీపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ 415 మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సతీష్, మహేందర్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, వైద్యాధికారి నీలిమ పాల్గొన్నారు.