మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 15 : మంచిర్యాలలోని పాత మంచిర్యాలలో ఉన్న విద్యుత్ శాఖ జిల్లా స్టోర్స్ నుంచి కరంటు తీగ(కండక్టర్) మాయమైన అంశంపై గందరగోళం నెలకొంది. జిల్లా స్టోర్స్ నుంచి సంబంధిత కాం ట్రాక్టర్ పూర్తి సామగ్రిని తీసుకెళ్లాడని, అందు కు సంబంధించి రిజిస్టర్లో సంతకం కూడా చేశాడని అధికారులు చెబుతుండగా, తనకు ఇవ్వాల్సిన సామగ్రి వాహనంలో పట్టకపోవడంతో 20 కిలో మీటర్ల కరంట్ వైరును స్టోర్స్‌లోనే ఉంచి వెళ్లినట్లు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఈ విషయంలో జిల్లాస్థాయి విచారణతో పాటు కంపెనీస్థాయిలో విచారణ జరుపుతున్న అంశాన్ని రహస్యంగా ఉంచడంపై ప లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో విద్యుత్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మంచిర్యాలలోని జిల్లా స్టోర్స్ నుంచి 2023 జనవరి 20న సామగ్రిని తీసుకువెళ్లాడు. 2024 మార్చిలో తనకు సం బంధించిన సామగ్రి జిల్లా స్టోర్స్‌లోనే ఉందని చెప్పడంతో ఇక్కడి అధికారులు అలాంటిది ఏమీలేదని, అంతా అప్పుడే ఇచ్చామని తేల్చిచెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో విచారణ జరిపారు. ఇటీవల కాగజ్ నగర్‌కు వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ దృష్టికి ఈ వ్యవహారం తీసుకువెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆయన ఆదేశించగా, వరంగల్‌కు చెందిన డీఈ స్థాయి అధికారి ఒక రు నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చి విచారణ జరిపారు.
తాము కాంట్రాక్టర్‌కు సామగ్రిని అంతా ఇచ్చేశామని, అధికారులు అందు కు సంబంధించిన సాక్ష్యాలను చూపించినట్లు తెలుస్తోంది. కాగా, దహెగాం మండలంలో విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించి నెలలు గడుస్తున్నా పురోగతి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు ఈ మేరకు విచారణ జరిపారు. దీంట్లో భాగంగానే సంబంధిత కాంట్రాక్టరును వారు అడుగగా తనకు రావాల్సిన సామగ్రి స్టోర్స్‌లో ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 20 కిలో మీటర్ల 32కేవీలైన్ కరెంటు తీగ విలువ సుమారుగా రూ. 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గందరగోళంగా మారిన ఈ అంశంపై ఉన్నతాధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.