పెంచికల్పేట్, జనవరి 20 : వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్ డేబ్రేవాల్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ముఖ్యంగా పశుకాపరులు దట్టమైన అడవిలోకి వెళ్లకూడదన్నారు. అటవీ ప్రాంతంలోనున్న విద్యుత్లైన్లను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. పులుల సంరక్షణకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడతామని, ఎలాంటి హానితలపెట్టబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం చెకులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ప్రభాకర్, పశు వైద్యాధికారి రాకేశ్, బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, పెంచికల్పేట్ ఇన్చార్జి ఎఫ్ఆర్వో సుధాకర్, సర్పంచులు జాజిమొగ్గ శ్రీనివాస్, దుర్గం రాజన్న, చంద్రమౌళి, దేవాజీ, ఎంపీటీసీలు రాజన్న శ్రీవిద్య, లావణ్య, డీఆర్వో ప్రభాకర్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.