నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో జనవరి 2న ప్రారంభం కానున్న శ్రీ శ్రీ శ్రీ ఖాందేవ్ జాతర ( Khandev Jatara) కు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) ను తోడసం వంశస్థులు, ఆదివాసి పెద్దలు సోమవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జాతర గోడపత్రులను ఆవిష్కరింపజేశారు.
ఖాందేవ్ పుణ్యక్షేత్రంలో మహా పూజ శనివారం ఉదయం తోడసం వంశస్తుల ఆడపడుచు మూడు కిలోల నువ్వుల తైలం తాగే మహోన్నత కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం దర్బార్ ఉంటుందని ఈ కార్యక్రమానికి రావాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెస్రం రూప్ దేవ్, జాతర నిర్వాహకులు నాగోరావు, మాజీ సర్పంచ్ మోకాలి రూప్ దేవ్, పూసంఇస్రూ, బాదిరావు. తోడసం వంశీయులు ఉన్నారు.