తాంసి : పర్యావరణ పరిరక్షణలో (environmental protection) భాగంగా తాంసి మండలం జామిడీ (Jamidi) గ్రామంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ నిర్వహించారు. ఎంపీడీవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. మానవాళికి , జీవరాశికి ప్రాణ వాయువు ఇచ్చే చెట్లు, పక్షులకు ఆశ్రయమిచ్చే వృక్షాలు కలిగిన చెట్ల విలువను గుర్తించాలని కోరారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కలను అందించాలని అధికారులను ఆదేశించారు.
వన మహోత్సవంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కల పంపిణీ చేపడుతున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి ఫ్రైడే లో భాగంగా నీటిని నిల్వ ఉండకుండా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. పంచాయతీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి, మొక్కలు అందజేసి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు.