కాసిపేట : ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah) పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా కాసిపేట మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. అనంతరం ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ (BRS) క్యాలెండర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య మాట్లాడుతూ హరిత ప్రేమికుడు కేసీఆర్ అని కొనియాడారు. హరితహారంతో తన పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చారని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటింకి వాస్ దేవ్, మాజీ సర్పంచులు ఆడె బాదు, అజ్మీర తిరుపతి, మాజీ డైరెక్టర్ ఏనుగు మంజులారెడ్డి, లంక లక్ష్మణ్, జాడి రాంచందర్, కైలాస్, మచ్చ అశోక్, రంగు రమేశ్, గజానంద్, మచ్చ ఆనీల్, బాసవేణి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
కుభీర్‌లో..
మండల కేంద్రం కుభీర్ లోకల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్ మాట్లాడుతూ అనతి కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రజల ఆశల్లో నీళ్లు పోశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జి కాశీనాథ్, ఠాగూర్ దత్తు సింగ్,గంధం పోశెట్టి, కాశీనాథ్, పుప్పాల దేవన్న, దొంతుల లింగన్న, వడ్నం దత్తాత్రి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.