నేరడిగొండ, జూలై 16 : పేద ప్రజలకు దవాఖాన ఖర్చుల నిమిత్తం అందించే డబ్బులపై కూడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ విమర్శించారు. మంగళవారం నేరడిగొండలో వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల చెక్కులను నిలిపివేయడం సరికాదని పేర్కొన్నారు. పేద ప్రజల అవసరాలను పసిగట్టి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్‌కుమార్, మండల కన్వీనర్లు శివారెడ్డి, నారాయణరెడ్డి, రాజారాం, తోట వెంకటేశ్, నాగయ్య, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి, జూలై 16: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ- రఘు, బీఆర్ఎస్ నాయకులు మహేందర్, భగవాన్లు, సురేశ్, లింగన్న పాల్గొన్నారు.
తలమడుగు, జూలై 16: ఝరి గ్రామానికి చెందిన దొంతుల మీనా ఇంటికి బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తలతో పంపించారు. ఇంటికి చెక్కు పంపించడంతో మీనా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.