తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తీపి కబురు అందించింది. సెర్ప్, మెప్మా సంఘాల్లోని సభ్యులకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వడ్డీలేని రుణాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెప్మా సంఘాలకు రూ. 25 కోట్లు, ఐకేపీ సంఘాలకు రూ. 34.20 కోట్లు విడుదల కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మహిళా దినోత్సవం రోజున మొత్తం రూ. 59.20 కోట్లు నేరుగా ఖాతాల్లో జమయ్యే అవకాశాలుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– నిర్మల్ టౌన్, మార్చి 6