ఎదులాపురం, అక్టోబర్ 4 : ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ పైలట్ ప్రాజెక్టు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 11, 12లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారాన్ని సేకరించడంతో సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని, తప్పులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, మావల తహసీల్దార్లు శ్రీనివాస్, వేణు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, వార్డు కౌన్సిలర్ షానవాజ్, తదితరులున్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 4 : అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం మండలంలోని ఆడెగాం(బీ) అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రిజిష్టర్లు, రికార్డులు, వంట గది, కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. చిన్నారులకు చదవడం, రాయడం నేర్పాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో కలిందిని, ఎంపీడీవో లక్ష్మణ్, కార్యదర్శులు పురుషోత్తం, హిమబిందు, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 4 : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కో సం పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మల్ పట్టణం 42 వ వార్డు(చింతకుంట)లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించా రు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల ఆధారం గా సర్వే చేస్తున్నామని కొత్త కుటుంబాల వివరాలను ఆధార్ కార్డు ద్వారా నమోదు చేస్తున్నట్లు సర్వే బృందం కలెక్టర్‌కు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాలు, వార్డుల్లో సర్వేలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.