నిర్మల్ అర్బన్, మార్చి 3 : “ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. ఈ నెల 5వ తేదీ(బుధవారం) నుంచి రెగ్యూలర్, ఒకేషనల్ ప్రథమ.. 6వ తేదీ (గురువారం) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాం..” అని డీఐఈవో పరశురాం తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : ఎన్ని సెంటర్స్? ఎంత మంది పరీక్ష రాస్తున్నారు?
డీఐఈవో : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 13,133 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 6,571 మంది.. ద్వితీయ సంవత్సరంలో 6,562 మంది రాస్తున్నారు. వీరి కి నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో 23 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అలాగే రెండు సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశాం.
నమస్తే : సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
డీఐఈవో : భైంసా కేంద్రాన్ని సమస్యాత్మక కేంద్రంగా గుర్తించాం. ఇలాంటి కేంద్రాలపై రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.
నమస్తే : మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు ఏమిటీ?
డీఐఈవో : ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు చేపట్టాం. కలెక్టర్, ఇంటర్మీడియట్ అధికారుల సూచనల మేరకు ప్రశాంతంగా నిర్వహిస్తాం.
నమస్తే : పరీక్షల నిర్వహణకు ఎంత మంది అధికారులు ఏర్పాటు చేశారు?
డీఐఈవో : పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, పరీక్షల పర్యవేక్షణ కోసం ముగ్గురు జిల్లాస్థాయి అధికారులు ఉంటారు. ఇందులో డీఐఈవో, సీనియర్ ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్‌తో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 250 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.
నమస్తే : ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?
డీఐఈవో : గతేడాది ప్రథమ సంవత్సరంలో 56 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయించి విద్యార్థులకు రీవిజన్ తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. 90 రోజుల ప్రణాళికను కేటాయించి, వాటిలో రీవిజన్ తరగతులు, 100 శాతం ఉత్తీర్ణతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాం. గతేడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తాం.
నమస్తే : ప్రైవేటు యాజమాన్యాల ఫీజుల ఒత్తిడి, హాల్‌టికెట్ల అందజేతపై ఎలా చర్యలు తీసుకున్నారు?
డీఐఈవో : ప్రైవేట్ యాజమాన్యాలను ఒత్తిడి లేకుండా విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయాలని ఆదేశించాం. అలాంటి కళాశాలలపై కచ్ఛితమైన చర్యలు తీసుకుంటాం. ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్నెట్లో పెట్టాం. నెట్ సెంటర్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు.
నమస్తే : ఎలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి?
డీఐఈవో : పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈసారి నిమిషం నిబంధనపై ఎలాంటి స్పష్టత లేదు. ఇం కా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవా లి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష ఉం టుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తు న్నాం. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరుస్తాం.